న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఒక వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి సీపీఆర్ చేసి కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీలోని గాలి నాణత్య, కాలుష్యంపై (Delhi Air pollution) మరింత ఆందోళన రేపుతున్నది. శనివారం మధ్యాహ్నం 12:20 గంటలకు నాంగ్లోయ్ మెట్రో స్టేషన్‌లోని సెక్యూరిటీ తనిఖీ వద్ద 58 ఏళ్ల అనిల్ కుమార్ కుప్పకూలిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ ఉత్తమ్ కుమార్ వెంటనే స్పందించారు. సీపీఆర్ ద్వారా ఆ వ్యక్తిని కాపాడారు. ఆ వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. ఆ మెట్రో స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఢిల్లీలో రోజు రోజుకు గాలి కాలుష్యం పెరుగుతున్నది. విషపూరిత పొగమంచు దట్టంగా అలముకుంటున్నది. దీంతో ఊపిరి పీల్చ లేక ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, పిల్లల్లో శ్వాసకోశ, కంటి వ్యాధులు పెరుగవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
सैल्यूट @CISFHQrs …#CISF personnel (Uttam Kumar) saved a precious life of a passenger by administering #CPR at Nangloi #Metro Station, New Delhi:
जय हिंद,जय जवान @CNNnews18 @News18India @News18Bihar @DCP_DelhiMetro @HMOIndia @DelhiPolice @News18UP @HindiNews18 #CAPF pic.twitter.com/JAt115byHQ
— Shankar Anand ( #News18 ) (@shankar_news18) November 5, 2023