న్యూఢిల్లీ, జనవరి 22 : మరో భారీ లేఆఫ్నకు అమెజాన్ సిద్ధమైంది. రానున్న నెలల్లో దాదాపు 30,000 ఉద్యోగాలపై అమెజాన్ కోత వేయనున్నట్లు గత ఏడాది అక్టోబర్లో రాయిటర్స్ వార్తాసంస్థ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. మొదటి విడతలో దాదాపు 14,000 ఉద్యోగులను తొలగించవచ్చని కూడా వార్తా సంస్థ తెలిపింది. ఆ దశ ఇప్పటికే పూర్తయింది.
ఇప్పుడు రెండో విడత కోతలు వస్తున్నాయి. జనవరి 27 నుంచి 16,000 మంది ఉద్యోగులపై టెక్ దిగ్గజం వేటు వేయనున్నట్లు ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనప్పటికీ కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావమే ఇందుకు కారణమని తెలుస్తున్నది.