న్యూఢిల్లీ: మరో 10,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్టు గ్లోబల్ ఈ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అమెజాన్ మంగళవారం ప్రకటించింది. 2023 చివరిలో 18,000 మంది ఉద్యోగులపై వేటువేసిన అమెజాన్ దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరో 10,000 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించడం సంచలనంగా మారింది. కంపెనీ ఆదాయం తగ్గిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, వినియోగదారుల కొనుగోలు పోకడలలో మార్పులు వంటివి అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలుగా తెలుస్తోంది. ప్రధానంగా రిటెయిల్ డివిజన్, హెచ్ఆర్ విభాగాలలో ఈ లేఆఫ్‌లు ఉండనున్నాయి. రెవెన్యూలో ఆటుపోట్లు, అస్థిర ఆర్థిక పరిస్థితి కారణంగా అమెజాన్ తన ఉద్యోగులను వదిలించుకునే చర్యలకు పూనుకుంది.