Amazon | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దిగ్గజ సంస్థ అమెజాన్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. తన అనుబంధ అమెజాన్ ఫార్మసీ, వన్ మెడికల్ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్ హెల్త్ సర్వీసెస్ హెడ్ నీల్ లిండ్సే మంగళవారం మెమో ద్వారా ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేశారు.
గత కొన్ని నెలలుగా అమెజాన్ వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్న విషయం తెలిసిందే. 2022 ఆఖరు నుంచి 2023 మధ్య వరకు దాదాపు 27 వేల మందిని పైగా తొలగించింది. అమెజాన్ సీఈవో అండీ జెస్సీ సంస్థలో వ్యయాన్ని తగ్గించుకొనే చర్యలను చురుగ్గా కొనసాగిస్తున్నారు.