Amazon | గూగుల్ బాటలో అమెజాన్.. ప్రైమ్ డివిజన్లో 5 శాతం ఉద్యోగులపై వేటు
ఐటీ సహా వివిధ బహుళజాతీయ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియ కొనసాగుతున్నది. గూగుల్, సిటీ గ్రూప్‌లు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో అమెజాన్ (Amazon) కూడా చేరింది.
న్యూఢిల్లీ: ఐటీ సహా వివిధ బహుళజాతీయ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియ కొనసాగుతున్నది. గూగుల్, సిటీ గ్రూప్‌లు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో అమెజాన్ (Amazon) కూడా చేరింది. తన ప్రైమ్ డివిజన్ నుంచి 5 శాతం ఎంప్లాయీస్‌ను తీసివేస్తున్నట్లు తెలిపింది. 2022లో వ్యాపారులకు సహాయం చేయడానికి, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి ఈ యూనిట్‌ను అమెజాన్ ప్రారంభించింది. అయితే ఎంతమందిని తొలగిస్తున్నదనే (Amazon Layoffs) విషయంపై స్పష్టతనివ్వలేదు.
కాగా, ఈ యూనిట్‌లోని 30 మంది ఉద్యోగులపై దీని ప్రభావం ఉంటుదని తెలుస్తున్నది. రిట్రెంచ్ అయిన ఉద్యోగులకు మరో యూనిట్ లేదా మరేదైనా కంపెనీలో ఉద్యోగం పొందడానికి కంపెనీ సహాయం చేస్తుందని అమెజాన్ తెలిపింది. వారికి 50 రోజుల వేతనంతోపాటు ఇతర బెనిఫిట్స్ అందిస్తామని పేర్కొంది. 2022 చివరి నుంచి ఇప్పటివరకు అమెజాన్‌లో 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటుపడింది.
అమెజాన్ కంటే ముందు గూగుల్ కూడా భారీ తొలగింపుల కోసం ప్రణాళికలు రూపొందించింది. గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ఈ సంస్థ 2024లో సైతం ఈ తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రకటనలు, అమ్మకాల విభాగం నుంచి వెయ్యి మందిని తొలగిస్తున్నట్టు గూగుల్ ఈ వారమే ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు ఇంకా ఆగిపోలేదని, ఈ ఏడాది మరింత అధికంగా ఉంటాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నిర్ధారించారు. ఈ సందర్భంగా ‘లేఆఫ్’ అన్న పదాన్ని వాడటాన్ని ఆయన వ్యతిరేకించారు.
ఈ ఏడాది సంస్థలో చేపట్టే భారీ మార్పుల గురించి ఇంటర్నెట్లో లీకైన ఆయన అంతర్గత మెమోలో వివరించారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా కంపెనీ సిబ్బందిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం గురించి ఆయన మాట్లాడారు. అయితే లేఆఫ్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఆయన వ్యతిరేకించారు. దానికి బదులుగా సంస్థకు మీరు అవసరం లేదని చెప్పడం ఒక ఫ్యాన్సీ మార్గమని ఆయన పేర్కొన్నారు. కాగా, యూట్యూబ్‌లో సుమారు 100 మంది ఉద్యోగులపై గూగుల్ తాజాగా వేటు వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

