జమ్ము: అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్నాథ్ వార్షిక యాత్ర గురువారం ప్రారంభమైంది. మొదటి గ్రూప్ యాత్రికులు భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరడంతో అమర్నాథ్ యాత్ర-2026 అధికారికంగా ప్రారంభమైందని ప్రకటించారు. మొదటి విడతగా 4,800 మందికి పైగా భక్తులు 259 వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య యాత్రకు బయలుదేరారు.
దీంతో జమ్ము ప్రాంతం ‘హర హర మహాదేవ్’ నినాదాలతో దద్దరిల్లింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి సుమారు 3,900 మీటర్ల ఎత్తున అమర్నాథ్ గుహలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించడం భక్తులు ఎంతో పవిత్రమైన శివయాత్రగా భావిస్తారు.