అమృత్సర్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సొంత పార్టీ స్థాపించి బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని ప్రకటించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ( Punjab deputy CM ) సుఖ్జిందర్ సింగ్ రణ్‌దావా మండిపడ్డారు. ఇన్నాళ్లూ బీజేపీని తిడుతూ వచ్చిన అమరీందర్ సింగ్.. ఇప్పుడు కొత్త పార్టీని స్థాపించి బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకుంటానని ప్రకటించడం ద్వారా తన నాశనాన్ని తనే కోరి తెచ్చుకున్నాడని వ్యాఖ్యానించారు.
1984లో రాజీనామా అనంతరం అమరీందర్ ఎక్కడికెళ్లాడు, పాకిస్థాన్‌తో అతనికి ఉన్న సంబంధాలు ఏమిటి అనే విషయంలో బీజేపీ సర్కారు విచారణ జరిపించాలని సుఖ్జిందర్ డిమాండ్ చేశారు. అమరీందర్‌పై చాలా ఒత్తిళ్లు ఉన్నాయని.. అతనికి, అతని పిల్లలకు వ్యతిరేకంగా చాలా కేసులు ఉన్నాయని.. ఆయన నిర్ణయంతో తాము భయపడాల్సింది ఏమీ లేదని ఆయన వ్యాఖ్యలు చేశారు.