ప్రయాగ్‌రాజ్, సెప్టెంబర్ 14: ఒక ఒప్పందం మాదిరిగా హిందూ వివాహాన్ని రద్దు చేయలేమని, హిందూ వివాహ బంధం నుంచి తొలగిపోవడం, రద్దు చేయడం కుదరదని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. హిందూ వివాహ చట్టం ప్రకారం కొన్ని పరిమిత పరిస్థితులు, సందర్భాల్లో.. అది కూడా పార్టీల నేతృత్వంలోని బలమైన సాక్ష్యాల వల్ల మాత్రమే మత కర్మ ఆధారంగా జరిగిన హిందూ వివాహం రద్దు చేయవచ్చునని పేర్కొంది.
ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌లు సౌమిత్ర దయాల్ సింగ్, డొనాది రమేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. అప్పీల్‌దారు ఒకసారి వివాహ రద్దుకు అనుమతి తెలిపి, తర్వాత దానిని రద్దు చేసుకున్నాక ముందుగా ఆమోదించిన సమ్మతికి అప్పీల్‌దారు కట్టుబడి ఉండాలని దిగువ కోర్టు బలవంతం చేయడం తగదని హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. 2011లో బులంద్‌షహర్ అడిషనల్ జిల్లా కోర్టు తమ వివాహం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.