ప్రయాగ్రాజ్ : విఫలమైన ప్రేమబంధాలు క్రిమినల్ చట్టాల దుర్వినియోగానికి దారితీస్తున్నాయని వ్యాఖ్యానిస్తూ అత్యాచార నిందితుడికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినడం పెరిగిపోతోందని, ఎడబాటు వల్ల కలిగే భావోద్వేగానికి క్రిమినల్ రంగు పులమడం జరుగుతోందని, ముఖ్యంగా విఫలమైన సంబంధాలలో ఇది ఎక్కువగా కనపడుతోందని హైకోర్టు పేర్కొంది. తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఓ మహిళ(25) ఇచ్చిన ఫిర్యాదుపై ఓ వివాహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇద్దరు వ్యక్తులు భావోద్వేగంతో చేసిన ఆరోపణలే తప్ప ఇందులో క్రిమినల్ చర్యలేవీ లేవని వ్యాఖ్యానించింది.