బెంగుళూరు: చంద్రయాన్-3(Chandrayaan-3)కి చెందిన విక్రమ్ ల్యాండర్ ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు చంద్రుడిపై దిగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ల్యాండింగ్ ప్రక్రియకు చెందిన అంశంపై కాసేపటి క్రితం ఇస్రో ఓ ట్వీట్ చేసింది. ఆటోమెటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కోసం అంతా సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో చెప్పింది. అయితే నిర్దేశిత పాయింట్ వద్దకు ల్యాండర్ మాడ్యూల్ చేరుకున్న తర్వాత.. ఆ సంకేతాలు పంపనున్నట్లు ఇస్రో వెల్లడించింది. సాయంత్రం సుమారు 5. 44 నిమిషాలకు ల్యాండర్ విక్రమ్ నిర్దేశిత కక్ష్యకు చేరుకోనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాతే ఏఎల్ఎస్ కమాండ్ అందుతుందని, ఆ కమాండ్ అందుకున్న తర్వాత.. ల్యాండర్ మాడ్యూల్‌ను యాక్టివేట్ చేయనున్నట్లు ఇస్రో చెప్పింది.
ల్యాండర్ మాడ్యూల్ యాక్టివేట్ కావడం వల్ల.. దాంట్లో ఉన్న ఇంజిన్లు ఆన్ అవుతాయి. ఆ ఇంజిన్లు ల్యాండర్ విక్రమ్‌ను సురక్షితంగా చంద్రుడిపై దింపుతాయి. ల్యాండర్ వేగాన్ని ఆ ఇంజిన్లు నియంత్రించనున్నాయి. ఒకవేళ వేగంలో ఎటవుంటి నియంత్రణ కోల్పోయినా.. అప్పుడు ప్రయోగం ప్రమాదంలో పడే ఛాన్సు ఉంటుంది. చంద్రయాన్-3లో అత్యంత కీలకమైన ఈ ఘట్టానికి చెందిన మిషన్ ఆపరేషన్స్‌ను , సీక్వెన్స్ కమాండ్ల గురించి అప్డేట్ ఉంటుందని ఇస్రో చెప్పింది. బెంగుళూరులోని మిషన్ ఆపరేషన్ కేంద్రమైన మాక్స్ నుంచి లైవ్ ప్రసారాలు సాయంత్రం 5. 20 నిమిషాలకు ప్రారంభంకానున్నట్లు ఇస్రో తన ట్వీట్లో తెలిపింది.
Chandrayaan-3 Mission:
All set to initiate the Automatic Landing Sequence (ALS).
Awaiting the arrival of Lander Module (LM) at the designated point, around 17:44 Hrs. IST.Upon receiving the ALS command, the LM activates the throttleable engines for powered descent.
The… pic.twitter.com/x59DskcKUV— ISRO (@isro) August 23, 2023