లక్నో: ఈసారి జరిగే ఎన్నికల్లో బుందేల్‌ఖండ్‌లో బీజేపీకి అన్ని తలుపులు మూసుకుపోతాయని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తెలిపారు. బూటకపు వాగ్దానాలను ప్రజలు అంగీకరించరని, బీజేపీ అధికారంలోకి రాకుండా చూస్తారని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల ఆదాయం తగ్గడం వంటివి రానున్న ఎన్నికల్లో బీజేపీ భవితవ్యాన్ని నిర్ణయించే అంశాలని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ 22 నెలల్లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించగలిగితే, అదే పని చేయడానికి బీజేపీ నాలుగున్నర ఏండ్లు ఎందుకు తీసుకుంది? అని ప్రశ్నించారు. యూపీ ప్రజల సంక్షేమం కోసం పని చేయడం వారికి ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణమని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌ను కూడా తిరస్కరిస్తారని, రాబోయే ఎన్నికల్లో వారికి సున్నా సీట్లు వస్తాయని ఎద్దేవా చేశారు.