న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: కొవిడ్ ప్రభావం వల్ల ఎంత కాలమైనా కొన్ని సమస్యలు వెంటాడుతాయని వైద్యశాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా గుండె సంబంధ సమస్యలు దీర్ఘకాలికంగా వెంటాడే అవకాశముంటుందని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.
గుండెలో మంట, గుండెనాళాల్లో రక్తం గడ్డకట్టడం, గుండె కొట్టుకునే వేగంలో మార్పులు.. ఇలా సమస్యలు వెంటాడుతూనే ఉంటాయని తెలిసింది. పైకి ఆరోగ్యంగా కనిపించేవారిలోనూ ఇవి ఉంటాయని అంటున్నారు. అమెరికాలోని 1.1 కోట్లమందిపై ఈ పరిశోధన జరిపారు. ఈ సమస్యలకు ఎవరూ అతీతులు కారని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ జియాద్ అలాలీ వెల్లడించారు.