అలీఘడ్ : అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి అతి పెద్ద తాళం ఆకర్షణగా నిలవనుంది. అలీగఢ్‌కు చెందిన ఓ భక్తుడు ఈ తాళాన్ని ఆలయానికి కానుకగా సమర్పించనున్నారు. 400 కిలోల బరువు, 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందం కలిగిన ఈ తాళం పూర్తిగా మానవ నిర్మితమని ఆ భక్తుడు తెలిపారు.
అలీగఢ్‌కు చెందిన సత్య ప్రకాశ్ శర్మ తన ఇష్ట దైవమైన శ్రీరాముడి కోసం రూ.2 లక్షలు ఖర్చు చేసి ప్రపంచంలోనే అతి పెద్ద హ్యాండ్ మేడ్ తాళాన్ని తయారు చేశారు.