న్యూఢిల్లీ, మే 1: కొన్ని రోజుల క్రితం భారత్ నిలిపివేసిన అధునాతన దేశీయ తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్మీ, ఎయిర్ఫోర్స్ల్లోని వాటికి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ, నౌకాదళంలో ఉన్న హెలికాప్టర్లకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది.
ఈ ఏడాది జనవరిలో పోరుబందర్లో కోస్టుగార్డుకు చెందిన ధ్రువ్ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో పైలట్ సహా మరొకరు మృతి చెందారు. అంతకుముందు ఒకసారి ఇది ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం తలెత్తడం, ప్రమాదాలకు గురవుతుండడంతో ధ్రువ్ కార్యకలాపాలను నిలిపివేశారు.