Akshay Kumar | ముంబై, అక్టోబర్ 29: బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ అయోధ్యలో వానరాల పట్ల అంతులేని ఔదార్యాన్ని కనబర్చారు. వాటి ఆహారం కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు. అయోధ్య నగరంలో వానరాల పోషణ నిమిత్తం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘ఆంజనేయ సేవా ట్రస్ట్’ వారికి ఈ విరాళాన్ని అందజేయనున్నట్టు అక్షయ్‌కుమార్ తెలిపారు.
తాను చేస్తున ఈ సేవ దివంగతులైన తన తల్లిదండ్రులు, తన మామ, బాలీవుడ్ వెటరన్ నటుడు రాజేశ్ ఖన్నాలకు అంకితం చేస్తున్నానని అక్షయ్‌కుమార్ తెలిపారు. కోతుల ఆహారం కోసం ఆయన భారీ విరాళం ప్రకటించటంపై ‘ఆంజనేయ సేవా ట్రస్ట్’ ఫౌండర్ ప్రియా గుప్తా హర్షం వ్యక్తం చేశారు.