ముంబై : బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తన లేటెస్ట్ ఫిల్మీ సెల్ఫీ రిలీజ్ కోసం సన్నద్ధమవుతూ ఈ మూవీలోని న్యూ సాంగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే పనిలో ఉన్నాడు. ఇక అక్షయ్ ఇటీవల మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి భాంగ్రా డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వారు ఓ పెండ్లి వేడుకకు హాజరైన క్రమంలో అక్కడ ఆడిపాడిన వీడియోను అక్షయ్ కుమార్ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ధోల్ బీట్స్‌కు అనుగుణంగా వీరు డ్యాన్స్ మూమెంట్స్‌తో దుమ్ము రేపడం ఈ వీడియోలో కనిపిస్తుంది. మోహన్‌లాల్ సర్‌తో డ్యాన్స్ చేసిన ఈ క్షణాలను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఈ పోస్ట్‌కు అక్షయ్ క్యాప్షన్ ఇచ్చారు.
ఇక సినిమాల విషయానికి వస్తే అక్షయ్ తదుపరి సెల్ఫీ మూవీలో సందడి చేయనున్నారు. ఈ సినిమాను రాజ్ మెహతా తెరకెక్కించగా ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పృధ్వీరాజ్ సుకుమారన్ మళయాళ సినిమా డ్రైవింగ్ లైసెన్స్‌కు రీమేక్‌గా ఈ మూవీ రూపొందింది. ఇక ఈ మూవీ తర్వాత అక్షయ్ క్యాప్సుల్ గిల్, ఓ మైగాడ్, వేదత్ మరాతె వీర్ దౌదలే సాత్, బడే మియా చోటే మియన్ వంటి సినిమాలను లైన్లో పెట్టాడు.