Union Budget 2024 | నిరుపయోగ బడ్జెట్.. ఇది ప్రజల కోసం కాదు: అఖిలేష్ యాదవ్
Union Budget 2024 | మధ్యంతర బడ్జెట్ (Union Budget 2024)పై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పెదవి విరిచారు. ఇది నిరుపయోగ బడ్జెట్ అని, ప్రజల కోసం కాదని విమర్శించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ (Union Budget 2024)పై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పెదవి విరిచారు. ఇది నిరుపయోగ బడ్జెట్ అని, ప్రజల కోసం కాదని విమర్శించారు. ‘ఏ బడ్జెట్ అయినా అభివృద్ధి కోసం కాకపోతే, ఏ అభివృద్ధి అయినా ప్రజల కోసం కాకపోతే, అది పనికిరానిది. బీజేపీ ప్రభుత్వం దశాబ్దం పాటు ప్రజావ్యతిరేక బడ్జెట్లను పూర్తి చేసి సిగ్గుమాలిన రికార్డ్ సృష్టించింది. ఈ రికార్డ్ ఎప్పటికీ బ్రేక్ కాదు. ఎందుకంటే సానుకూల ప్రభుత్వం రావడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది’ అని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో హిందీలో పోస్ట్ చేశారు.
కాగా, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కూడా కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. అసలు బడ్జెట్ జూలైలో వస్తుందని తెలిపారు. అప్పుడు ప్రజలు ప్రయోజనం పొందుతారని, పర్యాటకం పెరుగుతుందని, పరిశ్రమలు కూడా పెరుగుతాయని, దేశం పురోగమిస్తుందని అన్నారు.
कोई भी बजट अगर विकास के लिए नहीं है और कोई भी विकास अगर जनता के लिए नहीं है तो वो व्यर्थ है।
भाजपा सरकार ने जनविरोधी बजटों का एक दशक पूरा करके एक शर्मनाक रिकार्ड बनाया है, जो फिर कभी नहीं टूटेगा क्योंकि अब सकारात्मक सरकार आने का समय हो गया है।
ये भाजपा का ‘विदाई बजट’ है।
— Akhilesh Yadav (@yadavakhilesh) February 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

