హైదరాబాద్(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ) : ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్ వైఖరి పట్ల భాగస్వామ్య పక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని కాంగ్రెస్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కూటమి పక్షాల అవగాహన సార్వత్రిక ఎన్నికలకే పరిమితమా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న కూటమి సమావేశమైనప్పుడు కూడా తలెత్తిందని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పకపోవడం వల్లే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూటమి పక్షాలు పోట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందని ఒమర్ విమర్శించారు.