న్యూఢిల్లీ: ఆకాశ్ క్షిపణికి సంబంధించిన ఓ వీడియోను శనివారం ఇండియన్ ఆర్మీ షేర్ చేసింది. ఈ వీడియోలో ఆకాశ్ మిస్సైల్ టార్గెట్ ఎంగేజ్మెంట్ సామర్థ్య ప్రదర్శన ఉన్నది. క్షిపణి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కూడా చూపించారు. సముద్ర తీరం వద్ద ఈ క్షిపణిని పరీక్షించారు. హై అల్టీట్యూడ్లో కూడా టార్గెట్ను ఎంత కచ్చితంగా ఇది ధ్వంసం చేయగలదో వీడియోలో చూపించారు. 10 నుండి 40 కి.మీల ఎత్తులో విహరించే డ్రోన్లను కూడా ఈ మిస్సైల్ కూల్చేయగలదు.