న్యూఢిల్లీ : పైలట్ల రాజీనామాలతో ఒత్తిడికి లోనైన ఆకాశ ఎయిర్ (Akasa Air) సీఈవో వినయ్ దూబే కీలక ప్రకటన చేశారు. ఎయిర్‌లైన్‌ను మూసివేయడం లేదని, షట్‌డౌన్ ప్రచారానికి తెరదించుతూ సీఈవో దూబే ఉద్యోగులకు స్పష్టం చేశారు. కొద్దిమంది పైలట్ల రాజీనామాల కారణంగా ఎయిర్‌లైన్ కార్యకలాపాల్లో అంతరాయం వాటిల్లిందని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో దూబే అంగీకరించారు. ఎయిర్‌లైన్ మూతపడుతుందని మీడియాలో వెల్లడవుతున్న ఊహాగానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని దూబే ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
పైలట్ల రాజీనామాలతో ఒత్తిడికి లోనైన ఎయిర్‌లైన్ మూతపడుతుందని సాగుతున్న ప్రచారం సరైంది కాదని ఆయన తోసిపుచ్చారు. కొద్దిమంది పైలట్లు అకస్మాత్తుగా సంస్ధను వీడటంతో జులై, సెప్టెంబర్ మధ్య విమానాలకు అంతరాయం కలిగి చివరి నిమిషంలో రద్దయిన సందర్భాలు ఉన్నాయని దూబే పేర్కొన్నారు. నోటీస్ పీరియడ్ లేకుండానే కొందరు పైలట్లు విధుల నుంచి తప్పుకోవడంతో విమానాలు చివరినిమిషంలో రద్దయి ప్రయాణీకులు చిక్కుకుపోవడం, అసౌకర్యం కలిగిందని దూబే వివరించారు.
కాంట్రాక్టు ఒప్పందంలో భాగంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాజీనామా చేసిన పైలట్లపై న్యాయపరమైన చర్యలు చేపడతామని ఆకాశ ఎయిర్ సీఈవో పేర్కొన్నారు. పైలట్ల చర్యలు కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధమే కాకుండా ఏవియేషన్ రెగ్యులేషన్స్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. ఇవన్నీ స్వల్పకాలిక అవరోధాలే అని దూబే పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆకాశ ఎయిర్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. తాము దీర్ఘకాలం ఏవియేషన్ రంగంలో నిలదొక్కుకునే ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని దూబే తెలిపారు.
Read More :
Adhir Rajan Chowdhury: రాజ్యాంగం కొత్త కాపీల్లో సోషలిస్టు, సెక్యూలర్ పదాలు లేవు : అధిర్ రంజన్