ముంబై: విమానం కూలుతుందంటూ ఒకరు చేసిన ట్వీట్ కలకలం రేపింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఒక విద్యార్థిని అరెస్ట్ చేశారు. ‘ఆకాశ ఎయిర్‌కు (Akasa Air) చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ డౌన్ అవుతుంది’ అని ఇటీవల ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఆ సంస్థ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ట్వీట్ చేసిన ఐపీ అడ్రస్‌ను గుర్తించారు. గుజరాత్‌లోని సూరత్‌కు ముంబై పోలీసులు వెళ్లారు. మార్చి 27న 18 ఏళ్ల విద్యార్థిని అరెస్ట్ చేశారు.
కాగా, ఆకాశ సంస్థకు చెందిన విమానానికి బెదిరింపు ట్వీట్‌పై 12వ తరగతి విద్యార్థిని పోలీసులు ప్రశ్నించారు. అయితే విమానం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితోనే అలా పోస్ట్ చేసినట్లు అతడు తెలిపాడు. సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఊహించలేదని చెప్పాడు. గందరగోళం సృష్టించడం తన ఉద్దేశం కాదన్నాడు. అయితే ఆ విద్యార్థిని ఒక రోజు కస్టడీలో ఉంచినట్లు ముంబై పోలీసులు సోమవారం తెలిపారు. పరీక్షలు జరుగుతున్నందున నిందితుడ్ని బెయిల్‌పై విడుదల చేసినట్లు వెల్లడించారు.
Also Read: