ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ ఇవాళ మధ్యాహ్నం తన బాబాయ్ శరద్‌పవార్‌ను కలిసి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఎన్సీపీని వీడి తన వెంట నడిచిన వారిలో కీలక నేతలైన ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సేలతో కలిసి ఆయన.. వైబీ చవాన్ సెంటర్లో శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. బాబాయ్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చి నెలరోజులైనా కాకముందే అబ్బాయి తన వర్గం నేతలతో కలిసి బాబాయ్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది.
భేటీ అనంతరం అజిత్‌పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. తాము శరద్‌పవార్ ఆశీర్వాదం కోసం ఆయనను కలిశామని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్సీపీని రెండుగా కాకుండా ఐకమత్యంగా ఉంచుదామని తాము శరద్‌పవార్‌కు ప్రతిపాదించామని, కానీ అందుకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ప్రఫుల్ పటేల్ తెలిపారు.
కాగా, జూలై నెల ప్రారంభంలో అజిత్‌పవార్ తన బాబాయ్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చి, తన వర్గం నేతలతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారులో చేరారు. అందుకు ప్రతిఫలంగా ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి బాబాయ్, అబ్బాయ్ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. తాజాగా వాళ్లిద్దరూ భేటీ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Mumbai | Maharashtra Deputy CM Ajit Pawar along with Praful Patel, Chhagan Bhujbal and Dilip Walse Patil at Mumbai’s YB Chavan Centre pic.twitter.com/SbyrWOHpe9
— ANI (@ANI) July 16, 2023