బ్రాంప్టన్: కెనడాలోని పంజాబీ మూలాలు ఉన్న అజయ్‌పాల్ సింగ్ దలీవాల్(Ajaypal Singh Dhaliwal) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఒంటారియాలోని బ్రాంప్టన్‌కు చెందిన వ్యక్తి ఆయన. అయితే ఎవరెస్టు శిఖరం నుంచి దిగుతున్న సమయంలో ఆయన పడిపోయాడు. కానీ ఆ తర్వాత ఇతరుల సహాయంతో మళ్లీ లేచి విజయవంతంగా ఎవరెస్టు దిగాడు. మే 20వ తేదీన సుమారు 274 మంది పర్వతారోహకులు ఎవరెస్టును ఎక్కిన విషయం తెలిసిందే. దాంట్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ఆ రోజున వాతావరణం అనుకూలంగా ఉండడంతో భారీ సంఖ్యలో క్లైంబర్స్ నేపాల్ వైపు నుంచి ఎవరెస్టు శిఖరంపైకి చేరుకున్నారు.
అజయ్‌పాల్ దలీవాల్తో పాటు తులసి రెడ్డి పాల్పునూరి, సందీప్ ఆరె .. ఆ రోజున ఎవరెస్టు అధిరోహించారు. అయితే ఎవరెస్టు దిగుతున్న సమయంలో అజయ్‌పాల్ ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయింది. షెర్పా గైడ్ కూడా అతన్ని వదిలేశాడు.ఆ రోజున సందీప్ ఆరె, అరుణ్ కుమార్ తివారి ఎవరెస్టు దిగుతూ చనిపోయారు. కానీ దలీవాల్ మాత్రం తన వద్ద ఉన్న సేఫ్టీ బెల్ట్ సాయంతో ప్రమాదకరమైన మంచు ఫలకాలను దాటుతూ వచ్చాడు.
ఓ దశలో దలీవాల్ తన స్పృహ కోల్పోయాడు. చీకట్లో మళ్లీ స్పృహ తెచ్చుకున్న అతను, తన హెడ్‌ల్యాంప్ ద్వారా సిగ్నల్స్ అందజేశాడు. ఆ సిగ్నల్‌ను గుర్తించి ఓ నలుగురు పర్వతారోహకులు తమ ఆక్సిజన్ అందించారు. ఎవరెస్టు నుంచి కిందకు దిగే వరకు సహకరించారు. దలీవాల్ ప్రదర్శించిన సాహసం పట్ల పంజాబ్, కెనడా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.