న్యూఢిల్లీ: ఈ నెల 12న అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం నుంచి సేకరించిన బ్లాక్ బాక్సులోని సమాచారాన్ని విజయవంతంగా డౌన్ లోడ్ చేశామని, దానిని నిపుణులు విశ్లేషిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.
ప్రమాదం జరిగిన విమానం నుంచి రెండు బ్లాక్ బాక్స్లైన ఫ్లైట్ డాటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లను స్వాధీనం చేసుకున్నప్పటికీ అవి దెబ్బతినడటంతో వాటి నుంచి ఉపయోగపడే డాటా లభిస్తుందా లేదా అన్న సందేహాలు తొలుత తలెత్తాయి.