Air India | విమానంలో క్యాబిన్ పైకప్పు నుంచి నీటి లీకేజీ.. స్పందించిన ఎయిర్ ఇండియా
Air India | ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన ఒక విమానం పైభాగం నుంచి నీరు ధారగా కారిన (water leakage) విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ తాజాగా స్పందించింది.
Air India | ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన ఒక విమానం పైభాగం నుంచి నీరు ధారగా కారిన (water leakage) విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ తాజాగా స్పందించింది.
‘నవంబర్ 24 న గాట్విక్ (Gatwick) నుంచి అమృత్సర్ (Amritsar)కు వెళ్లిన ఎయిర్ ఇండియా AI169 విమానంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. క్యాబిన్ పైకప్పు నుంచి ఓ చోట నీరు లీకైంది. లీకేజీ కింది సీట్లో కూర్చున్న ప్రయాణికుల్ని తక్షణమే మరో చోటుకు మార్చాం. ప్రయాణికుల భద్రత, సౌకర్యానికి కట్టుబడి ఉన్నాం. ఊహించని ఈ ఘటనకు మేం చింతుస్తున్నాం’ అంటూ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, లీకేజీకి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
ఎయిర్ ఇండియా విమానంలోని ఓవర్‌హెడ్ బిన్ల నుంచి నీరు లీకైంది. దీంతో విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నీటి లీకేజీని నివారించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు. దీంతో లీకేజీ కింద కూర్చున్న ప్రయాణికుల్ని వేరే చోటుకు మార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విమానాల్లో ఇలాంటివి సాధారణమేనని, సాంకేతిక సమస్య వల్ల ఇలా జరుగుతాయని కొందరు తెలిపారు. అయితే విమానాల నిర్వహణలో లోపాల కారణంగా ఇది జరిగిందంటూ మరికొందరు మండిపడ్డారు. విమాన సంస్థల నిర్లక్ష్యంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Air India flight 🇮🇳🤦🏽♂️🤦🏽♂️pic.twitter.com/7dpgcSPI2g
— Farid Khan (@_FaridKhan) November 29, 2023
Also Read..
Viral Video | ప్రయాణికుల సాక్షిగా కదులుతున్న రైల్లో ఒక్కటైన ప్రేమ జంట.. వీడియో
Qatar | ఖతార్‌లో జర్మనీ అధ్యక్షుడికి అవమానం.. అసలేం జరిగిందంటే?
Hyderabad | హైదరాబాద్ ఇండ్లకు భలే డిమాండ్.. 3 నెలల్లో ఎన్ని అమ్ముడుపోయాయంటే..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

