Air India | న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా తుషార్ మసంద్ అనే ప్రయాణికుడు తన ముందు సీట్లో కూర్చున్న హిరోషీ యొషిజనే అనే వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు బయల్దేరిన ఏఐ2336 విమానంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు బ్రిడ్జిస్టోన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్.
బాధితుడిని విమానం సిబ్బంది టాయ్‌లెట్‌కు తీసుకెళ్లి, తువ్వాలు, ఇతర సామగ్రి ఇచ్చి, శుభ్రం చేసుకోవడానికి సహకరించారు. నిందితుడిని వేరొక సీట్లోకి పంపించేశారు. బాధితుడు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించడంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు ఎయిరిండియా రిపోర్ట్ చేసింది. బాధితునికి నిందితుడు పదే పదే క్షమాపణలు చెప్పాడు. నిందితుడిని అధికారులు మందలించారు.