న్యూఢిల్లీ: సంస్థ నిబంధనలు ఉల్లంఘించి, నైతిక విలువలకు తిలోదకాలిచ్చారనే కారణంతో ఏకంగా వెయ్యిమందికిపైగా సిబ్బందిపై ఎయిర్ ఇండియా వేటు వేసింది. టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా వెళ్లిన తరువాత భారీ ప్రక్షాళన జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
విమానాల్లోని వస్తువులను దొంగిలించడం, ప్రయాణికుల అదనపు లగేజీకి ఎటువంటి రుసుము తీసుకోకుండానే అనుమతించడం తదితర ఆరోపణల దరిమిలా ఈ చర్యలు తీసుకున్నట్లు సీఈవో తెలిపారు. సిబ్బంది ఎల్లప్పుడూ నిజాయితీగా మెలగాలని సూచించారు. ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ విధానాన్ని వందలాది మంది సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు యాజమాన్యం గుర్తించింది.