Nurabot | న్యూఢిల్లీ: తైవాన్ పెద్ద ఎత్తున నర్స్‌ల కొరతను ఎదుర్కొంటున్నది. దీనికి పరిష్కారంగా ‘ఏఐ నర్స్’లను రంగంలోకి దింపుతున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ నర్స్..‘నూరాబోట్’ తైవాన్ దవాఖానల్లో విధులు నిర్వర్తించేందుకు రంగం సిద్ధమైంది. తైవాన్‌లోని పేరొందిన మెడికల్ సెంటర్లు, జనరల్ హాస్పిటల్స్‌లో ఏఐ నర్సులను ఏర్పాటుచేయబోతున్నారు.
ఫాక్స్‌కాన్, ఎన్విడియా కంపెనీల సహకారంతో తైవాన్‌లో ఏఐ దవాఖానలు రూపుదిద్దుకుంటున్నాయి. క్లినికల్ కేర్‌లో సంక్లిష్టమైన పనులను సైతం చేపట్టే విధంగా ‘నూరాబోట్’లను రూపొందించారు. సాధారణ దవాఖానలను ‘ఏఐ దవాఖాన’లుగా మార్చేందుకు ఫాక్స్‌కాన్, ఎన్విడియా కొన్ని టూల్స్ అభివృద్ధి చేశాయి.