న్యూఢిల్లీ : యుద్ధాల్లో డ్రోన్ల వాడకం పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో 2026 నాటికి 10 లక్షల డ్రోన్లను సేకరించేందుకు డ్రాగన్ దేశం ఆర్డర్ పెట్టినట్లు ఆ దేశ సైనిక వర్గాలు ఇటీవల తెలిపాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత తేలికపాటి కమికాజ్ డ్రోన్లను చైనా సైన్యం వాస్తవాధీన రేఖ వెంబడి మోహరిస్తే, భారత్కు పెను సవాల్ ఎదురు కానుంది. ఏఐ ఆధారిత డ్రోన్ టెక్నాలజీతో భవిష్యత్తు యుద్ధాలపై ఆధిపత్యం చెలాయించాలని చైనా కోరుకుంటున్నట్లు దీనిని బట్టి అర్థమవుతున్నది.