Divorce | ఐదు రూపాయల కుర్కురే కొనివ్వలేదని.. విడాకులకు అప్లై చేసిన భార్య!
Divorce | కేవలం ఐదు రూపాయల కుర్కురే వల్ల వచ్చిన వివాదం భార్యాభర్తల దాంపత్య జీవితంలో చిచ్చుపెట్టింది. తనకు కుర్కురే ప్యాకెట్ కొనివ్వలేదని భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. ఈ వింత ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని షాహ్ గంజ్‌లో చోటుచేసుకుంది.
Divorce | కేవలం ఐదు రూపాయల కుర్కురే వల్ల వచ్చిన వివాదం భార్యాభర్తల దాంపత్య జీవితంలో చిచ్చుపెట్టింది. తనకు కుర్కురే ప్యాకెట్ కొనివ్వలేదని భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. ఈ వింత ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని షాహ్ గంజ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. షాహ్గంజ్కు చెందిన ఓ దంపతులకు గత ఏడాదిలో వివాహమయ్యింది. అయితే ఆ భార్యకు కుర్కురే అంటే చెప్పలేనంత పిచ్చి. రోజూ కచ్చితంగా ఒక కుర్కురే ప్యాకెట్ తినాల్సిందే. పెళ్లయిన కొత్తలో ఇదే విషయం భర్తకు చెబితే సరే అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి వచ్చేటప్పుడు రెగ్యులర్‌గా ఐదు రూపాయల కుర్కురే ప్యాకెట్ కొనుక్కొచ్చి ఇచ్చేవాడు. అయితే వర్క్ బిజీలోనో.. మరో కారణంతోనో.. ఒకరోజు కుర్కురే ప్యాకెట్ తీసుకెళ్లడం మరిచిపోయాడు. ఇంకేముంది.. ఆ భార్య హర్ట్ అయ్యింది. తనకు ఎంతో ఇష్టమైన కుర్కురే తీసుకురాలేదని భర్తతో గొడవకు దిగింది. ఇంత చిన్న విషయానికి అంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నావని భర్త అన్నప్పటికీ వినిపించుకోలేదు. దీంతో అలిగిన భార్య.. తన పుట్టింటికి వెళ్లిపోయింది. తన కోరిక తీర్చని వాడితో కలిసి ఉండే బదులు విడిపోవడమే బెటర్ అని ఫిక్సయ్యింది.
తనకు విడాకులు ఇప్పించాలని షాహ్గంజ్ పోలీసులకు సదరు భార్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు భార్య ఫిర్యాదును పోలీసులు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెల్‌కు బదిలీ చేశారు. దీంతో భార్యాభర్తలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లయిన ఏడాదిలోనే విడాకులు ఎందుకు తీసుకుంటున్నారని అక్కడ అధికారులు ప్రశ్నించగా.. భర్త తనను కొట్టాడని చెప్పింది. ఎందుకు కొట్టాడని కారణం ఆరా తీయగా.. అసలు విషయం చెప్పింది. కుర్కురే కోసం గొడవ జరిగిందని తెలిసి అధికారులు షాకయ్యారు. చిన్న కారణంతోనే విడాకులకు సిద్ధమైన భార్యకు, ఆమెతో గొడవకు దిగిన భర్తకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు నచ్చజెప్పారు. కాగా, ప్రస్తుతం వీరి విడాకుల కేసు వాయిదా పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

