బాల కృష్ణుడి విగ్రహానికి చికిత్స.. విరిగిన చేతికి కట్టుకట్టిన వైద్యులు

ఆగ్రా: బాల కృష్ణుడి విగ్రహానికి వైద్యులు చికిత్స చేశారు. విరిగిన విగ్రహం చేతికి కట్టుకట్టారు. ఆశ్చర్యపరిచే ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. అర్జున్ నగర్ ఖేరియా మోడ్లోని పత్వారీ ఆలయంలో లేఖ్ సింగ్ అనే వ్యక్తి 30 ఏండ్లుగా పూజారిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఎంతగానో ఆరాధించే ‘లడ్డూ గోపాలుడి’ విగ్రహానికి శుక్రవారం స్నాన, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుండగా జారి పడింది. దీంతో బాల కృష్ణుడి విగ్రహం చేయి విరిగింది.
ఈ ఘటనపై పూజారి లేఖ్ సింగ్ తల్లడిల్లిపోయారు. లడ్డూ గోపాలుడి విగ్రహం, విరిగిన చేతిని తీసుకుని ఏడుస్తూ ఆగ్రా జిల్లా ఆసుపత్రికి పరుగులుతీశారు. తనకు ఎంతో అనుబంధమున్న బాల కృష్ణుడికి చికిత్స చేయాలని అక్కడి వైద్యులను ప్రాధేయపడ్డారు.
తొలుత పూజారి విన్నపాన్ని వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. అయితే ఆ పూజారి ఏడ్వడం చూసిన వైద్యులు, జిల్లా చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ అగర్వాల్కు పరిస్థితిని వివరించారు. ఆయన సూచన మేరకు శ్రీకృష్ణ పేరుతో రిజిస్టర్లో పేషంట్ పేరు నమోదు చేశారు. అనంతరం విరిగిన విగ్రహం చేతికి బ్యాండేజీతో కట్టుకట్టి చికిత్స చేశారు.

కాగా, బాల గోపాలుడి విగ్రహం చేయి విరిగిందన్న బాధతో ఏడుస్తున్న పూజారిని సంతృప్తి పరిచేందుకే ఇలా చేసినట్లు జిల్లా చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ అగర్వాల్ తెలిపారు. మరోవైపు ఆ పూజారి కృష్ణుడి విగ్రహంతో ఆసుపత్రి వద్ద ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

