Agni Prime: అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్
Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్ పరీక్ష సక్సెస్ అయ్యింది. ఒడిశా తీరంలో ఈ పరీక్షను చేపట్టారు. తొలిసారి రాత్రి పూట ఈ పరీక్షను నిర్వహించారు. క్షిపణి విజయవంతమైన నేపథ్యంలో రక్షణ మంత్రి డీఆర్డీవోకు కంగ్రాట్స్ తెలిపారు.
హైదరాబాద్: కొత్త జనరేషన్‌కు చెందిన అగ్ని ప్రైమ్(Agni Prime) బాలిస్టిక్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. డీఆర్డీవో ఈ పరీక్ష చేపట్టింది. ఒడిశా తీరంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని పరీక్షించారు. బుధవారం రాత్రి పూట ఈ పరీక్షను నిర్వహించారు. ఫ్లయిట్ టెస్ట్ సమయంలో ఆ క్షిపణి అన్ని లక్ష్యాలను సక్సెస్‌ఫుల్‌గా చేరుకున్నట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు.
మూడుసార్లు విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ప్రీ ఇండక్షన్ నైట్ లాంచ్‌ను చేపట్టారు. బాలిస్టిక్ క్షిపణికి చెందిన కచ్చితత్వాన్ని, విశ్వసనీయతను టెస్ట్ చేశారు. రేడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్‌ను వేర్వేరు ప్రాంతాల్లో మోహరించి ఈ పరీక్షను కొనసాగించారు. క్షిపణికి చెందిన ఫ్లయిట్ డేటాను పూర్తిగా సేకరించారు.
#DRDOUpdates | First Pre Induction night launch of New Generation Ballistic Missile Agni Prime was successfully conducted off the coast of Odisha on 07 June 2023. https://t.co/gdkZozarng#Atmanirbharbharat @DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/26Zj2rBkON
— DRDO (@DRDO_India) June 8, 2023
డీఆర్డీవోకు చెందిన సీనియర్ అధికారులు, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అధికారులు ఈ పరీక్షను ప్రత్యక్షంగా వీక్షించారు. అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతమైన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవో అధికారులను అభినందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

