రాయ్‌పూర్: జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ముందు టైరు పేలింది. (Car Tyre Bursts) దీంతో అది బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం పెళ్లి వేడుకకు హాజరైన కొందరు మనేంద్రగఢ్ నుంచి అంబికాపూర్‌కు కారులో వెళ్తున్నారు. జాతీయ రహదారి 43లోని చంద్రపూర్ గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న ఎస్యూవీ ముందు టైర్ పేలింది. దీంతో ఆ కారు బోల్తాపడింది.
కాగా, ఆ కారులో ప్రయాణించిన ఐదుగురిలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులను ఒడిశాలోని ఝర్సుగూడకు చెందిన ఆనంద్ చౌదరి (28), అంబికాపూర్‌కు చెందిన రీటా చౌదరి (46), కోర్బాకు చెందిన పుష్పా మాంఝీ (40)గా గుర్తించారు.
మరోవైపు ఈ ప్రమాదంలో అజయ్ నాథ్ చౌదరి (38), అతడి కుమారుడు అనికేత్ (10) తీవ్రంగా గాయపడ్డారు. వారిని సూరజ్‌పూర్‌లోని ఆసుపత్రికి తొలుత తరలించారు. మెరుగైన చికిత్స కోసం అంబికాపూర్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.