న్యూఢిల్లీ, ఆగస్టు 22 : వచ్చే నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. 46 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇద్దరు తప్ప మిగతా వారి దరఖాస్తులను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్టు శుక్రవారం అధికారులు తెలిపారు.
వారంతా మొత్తం 68 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన తర్వాత ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి మాత్రమే రంగంలో మిగిలారు. వీరిద్దరూ తలో నాలుగు సెట్ల నామినేషన్ పేపర్లు దాఖలు చేయగా, అన్నీ సక్రమంగా ఉండటంతో అధికారులు ఆమోదించారు.