గువాహటి: శంకుస్థాపన కార్యక్రమంలో కట్ చేయాల్సిన రిబ్బన్ మిస్ అయ్యింది. దీంతో శంకుస్థాపన కోసం వచ్చిన ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడున్న వ్యక్తిని అరటి బోదెతో కొట్టారు. (MLA Thrashes Man With Banana Plant) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అస్సాంలోని ధుబ్రి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 18న తూర్పు బిలాసిపరా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సంసూల్ హుడాను వంతెన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం కోసం ఆహ్వానించారు. దీని కోసం రెండు అరటి మొక్కల మధ్య గులాబీ రంగు రిబ్బన్ కట్టారు.
కాగా, శంకుస్థాపన వద్ద శిలాఫలకానికి రెడ్ రిబ్బన్ లేకపోవడంతో ఏఐడీయూఎఫ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంసూల్ రెచ్చిపోయారు. ఆగ్రహంతో అక్కడున్న ఒక వ్యక్తి చెంపపై కొట్టారు. కోపాన్ని తట్టుకోలేక అరటి బోదెను లాగి దానితో కొట్టారు. ఆ ఎమ్మెల్యేను సముదాయించేందుకు కొందరు నేతలు ప్రయత్నించారు.
మరోవైపు ఎమ్మెల్యే హుడా అకారణంగా తనను కొట్టినట్లు కాంట్రాక్టర్ సహోద్యోగి సహిదుర్ రెహ్మాన్ ఆరోపించాడు. ఒక ప్రజా ప్రతినిధి అలా ప్రవర్తించడాన్ని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నాడు. ఇది అవమానకరం, బాధాకరమైన సంఘటన అని వాపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
असम के धुबरी जिले के पूर्वी बिलासिपारा विधानसभा से विधायक हैं समसुल हुदा…
विधायक जी को एक पुल के शिलान्यास के लिए बुलाया गया था…
विधायक जी को शिलान्यास के लिए फीता काटना था. इसके लिए केले के दो पौधों के बीच एक गुलाबी फीता लगाया गया था…
लेकिन विधायक जी इस बात पर भड़क गए… pic.twitter.com/TXEGBK6WkW
— Amit Yadav (Journalist) (@amityadavbharat) March 20, 2025