Jyotiraditya Scindia | ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో ఖాతా తెరవని పార్టీ పగటి కలలు కంటున్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సెటైర్లు వేశారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ అయోధ్యలో మాదిరే గుజరాత్ రాష్ట్రంలోనూ బీజేపీని ఓడిస్తామని పేర్కొన్నారు. దీనిపై జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు.
‘ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటున్నది. బీజేపీతో ముఖాముఖీ పోటీ పడిన చోట్ల కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 శాతం మాత్రమే సానుకూల ఫలితాలొచ్చాయి. మూడోసారి వరుసగా ఓటర్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఆ పార్టీ నేతలకు అహంకారం తగ్గలేదు. ప్రజాతీర్పును శిరసావహించకుండా అసహనం ప్రదర్శిస్తున్న వారు వాస్తవాన్ని గుర్తించి ఆత్మ విమర్శ చేసుకోవాలి’ అని రాహుల్ గాంధీపై సింధియా పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
Ayushman Bharat | రూ. 10 లక్షల వరకూ ఆయుష్మాన్ భారత్ లిమిట్..?!
Ola Cabs – Ola Maps | గూగుల్ మ్యాప్స్‌కు బైబై.. ఇక ఓలా మ్యాప్స్ పైనే క్యాబ్ రైడింగ్.. ఎందుకంటే..?!
iPhone 14 Plus | ఐ-ఫోన్ 14 ప్లస్ కావాలా.. రూ.23 వేల వరకూ ఆదా చేయొచ్చు..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!