Lok Sabha | వంద మందితో బీజేపీ తొలి లిస్ట్.. నేడు ఏక్షణమైనా రిలీజ్ కావొచ్చు
Lok Sabha | దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండటంతో.. అన్ని పార్టీలు ఇప్పటికే సమయాత్తమవుతున్నాయి.
Lok Sabha | దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండటంతో.. అన్ని పార్టీలు ఇప్పటికే సమయాత్తమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తీరిక లేకుండా గడుతున్నాయి. ఇక కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ మేరకు ఎన్నికలకు గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తోంది.
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ తరఫున లోక్‌సభకు (Lok Sabha) పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకు చేరినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. గురువారం రాత్రి 10:30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున నాలుగింటి వరకూ ఈ కమిటీ చర్చలు జరిపింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక చర్చలు కొనసాగించారు. దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్ సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేసినట్లు సమాచారం. శుక్రవారం ఏ క్షణమైనా తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా వందకుపైగా స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ నేడు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఖరారైన అభ్యర్థుల జాబితాకు ప్రధాని మోదీ ఆమోదం తెలపనున్నారు. మోదీ ఆమోదం తర్వాత శుక్రవారం ఏ సమయంలోనైనా తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయని తెలిసింది. తొలి జాబితాలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా మొత్తం 100 మంది పేర్లు ఉన్నట్లు సమాచారం. చాలా మంది సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధించాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోదీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలుచుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దాదాపు 160 స్థానాల్లో బలహీనంగా ఉన్నట్టు బీజేపీ అధిష్ఠానం గుర్తించింది. ఈ సీట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకునేందుకు మోదీ కొత్త వ్యూహాలను అమలుపరచనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Also Read..
LPG cylinder | వినియోగదారులకు షాక్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
Gold Seized | తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో వెయ్యి గ్రాముల బంగారం పట్టివేత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

