Flyers protest | జార్ఖండ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దు.. ప్రయాణికులు ఆగ్రహం
Flyers protest | జార్ఖండ్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దైంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో నిరసనకు దిగారు. (Flyers protest) ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దైంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో నిరసనకు దిగారు. (Flyers protest) ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఇండిగో విమానం 6ఈ 2198 ఢిల్లీ నుంచి జార్ఖండ్‌లోని డియోగఢ్కు బుధవారం తెల్లవారుజామున వెళ్లాల్సి ఉంది. అయితే ఆ విమానాన్ని ఆ సంస్థ రద్దు చేసింది. దీంతో విమాన ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. ఇండిగో విమానాన్ని రద్దు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ‘ఇండిగో చోర్ హై, బంద్ కరో’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం చెలరేగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, విమానం రద్దుపై ఇండిగో సంస్థ విరవణ ఇచ్చింది. వాతావరణ పరిస్థితులు, నియంత్రణకు మించిన కారణాల వల్ల ఢిల్లీ-డియోగఢ్ విమానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. విమాన ప్రయాణికులకు పూర్తి రీఫండ్, ప్రత్యామ్నాయ మార్గాలు లేదా రీషెడ్యూలింగ్ పొందే ఆప్షన్లు ఇవ్వడంతోపాటు రిఫ్రెష్మెంట్లు అందించినట్లు వెల్లడించింది.
మరోవైపు ఢిల్లీలో దట్టమైన మంచు వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో సుమారు పది విమానాలు రద్దయ్యాయి. అలాగే 50కుపైగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి.
#WATCH | Passengers of Delhi-Deoghar IndiGo flight raise slogans and protest against the airline after it cancels the flight originating from Terminal 2 of Delhi airport pic.twitter.com/L8Nj1cW4Vq
— ANI (@ANI) January 31, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cancels
- Delhi Airport
- flight
- indigo
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

