కోల్‌కతా: గాంధీల హయాంలో ఉన్నత పోస్టులు పొందిన కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పుడు వారిని ఎందుకు విమర్శిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ జవహర్ సర్కార్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అసురుడని వ్యాఖ్యానించారు. అలాంటి ఆయన కింద జైశంకర్ పని చేస్తున్నారని దుయ్యబట్టారు. జైశంకర్ తండ్రి గుజరాత్ అల్లర్లను తప్పుపట్టిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, మంగళవారం ఏఎన్ఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 1980లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి డాక్టర్ కే సుబ్రహ్మణ్యంను రక్షణ ఉత్పత్తి కార్యదర్శి పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. అలాగే రాజీవ్ గాంధీ హయాంలో తన కంటే జూనియర్‌ను కేబినెట్ కార్యదర్శిగా నియమించారని విమర్శించారు. భారత్ ప్రగతికి సరైన పార్టీగా భావించిన తాను బీజేపీలో చేరినట్లు చెప్పారు.
కాగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి జవహర్ సర్కార్ దీనిపై స్పందించారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించిన కేంద్ర మంత్రి జైశంకర్‌పై ట్విట్టర్లో మండిపడ్డారు. ‘విచిత్రం. గాంధీలకు అత్యంత విధేయతతో సేవ చేసి, వారి కింద అత్యుత్తమ పోస్టింగ్‌లు పొందిన తర్వాత గాంధీల పట్ల తనకున్న బెంగను జైశంకర్ కనిపెట్టారా? అని ప్రశ్నించారు. ఇది మతిమరుపా? లేక విదేశాంగ మంత్రిగా అపూర్వమైన పదోన్నతి వల్ల బీజేపీని కౌగిలించుకుంటున్నారా?’ అని దుయ్యబట్టారు.
అలాగే జైశంకర్ తండ్రి కే సుబ్రహ్మణ్యం గుజరాత్ అల్లర్లను ఖండించిన సంగతి జవహర్ సర్కార్ గుర్తు చేశారు. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లలో ధర్మం చచ్చిపోయిందని, అమాయక ప్రజలను రక్షించడంలో విఫలమైన వారు అధర్మానికి పాల్పడ్డారని జైశంకర్ తండ్రి కే సుబ్రహ్మణం విమర్శించినట్లు తెలిపారు. రాముడు ఉండి ఉంటే తన విల్లును గుజరాత్‌లోని ‘అసుర’ పాలకులపై ప్రయోగించి ఉండేవాడని ఆయన వ్యాఖ్యానించినట్లు చెప్పారు. అలాంటిది ఆయన కుమారుడు (జై శంకర్) ఇప్పుడు అసురుడ్ని (మోదీ)ని వెనుకేసుకురావడం సిగ్గుచేటని ట్విట్టర్లో విమర్శించారు. బీబీసీ డాక్యుమెంటరీలోని వాస్తవాలు నిజమా? అబద్ధమా అని ఆయన ప్రశ్నించారు. గుజరాత్‌లోని నాటి మోదీ ప్రభుత్వం అల్లర్లలో జోక్యం చేసుకోకుండా ఉండి ఉంటే ఎంతో మంది ప్రాణాలు నిలిచేవి కాదా? అని నిలదీశారు.
S Jaishankar’s father, K Subramanyam said “Dharma was killed in Gujarat (2002 Riots).
Those who failed to protect innocent citizens are guilty of adharma.
Rama…would have used his bow against the ‘Asura’ rulers of Gujarat.”
Shame on son —serving Asura! https://t.co/rb5gkcerYs— Jawhar Sircar (@jawharsircar) February 21, 2023
“Timing of BBC documentary on Gujarat Riots of 2092 is not ‘accidental’, it is
"politics by another means," says Jaishankar.
Question is: Are the facts shown true or false?
Could thousands of lives be saved if Modi administration was less indulgent? https://t.co/Y3clgHxAY5— Jawhar Sircar (@jawharsircar) February 21, 2023