పాట్నా: మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్ (online game) ఆడేందుకు పేరెంట్స్ నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఒక వ్యక్తి కోపంతో తాళం చెవులు, నెయిల్ కట్టర్లు, కత్తిని మింగాడు. అతడి ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో సర్జరీ చేసిన డాక్టర్లు వాటిని బయటకు తీశారు. బీహార్‌లోని మోతిహారిలో ఈ సంఘటన జరిగింది. మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడేందుకు ఒక వ్యక్తిని కుటుంబ సభ్యులు అనుమతించలేదు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో అతడికి వాగ్వాదం జరిగింది. ఆ వ్యక్తి కోపంతో ఒక తాళం చెవి, కొన్ని తాళం చెవులు, రెండు నెయిల్ కట్టర్లు, ఒక కత్తిని మింగాడు.
కాగా, కొంత సేపటి తర్వాత ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడ్ని
మోతిహారిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఎక్స్ రే తీశారు. అతడు మింగిన వస్తువులు ఎక్స్‌రేలో కనిపించాయి. దీంతో డాక్టర్లు సర్జరీ చేశారు. గంటర్నరపాటు శ్రమించారు. ఆ వ్యక్తి మింగిన తాళం చెవులు, నెయిల్ కట్టర్లు, కత్తిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ అమిత్ కుమార్ తెలిపారు.