చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో కలత చెందిన రంజిత్ సింగ్ చౌతాలా గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. (Haryana minister resigns) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి జరిగే ఎన్నికల కోసం 67 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. అయితే విద్యుత్ శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలాతో పాటు తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జాబితా నుంచి మినహాయించింది.
కాగా, సిర్సా జిల్లాలోని రానియా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన రంజిత్ సింగ్ చౌతాలా ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు పార్టీలో లాబీయింగ్ చేశారు. అయితే ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఆ స్థానం పార్టీ అభ్యర్థిగా శిష్పాల్ కాంబోజ్ను ప్రకటించింది. దీంతో కలత చెందిన రంజిత్ సింగ్ చౌతాలా మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు గురువారం ప్రకటించారు. రానియా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మీడియాతో అన్నారు.
మరోవైపు లోక్సభ ఎన్నికలకు ముందు రంజిత్ సింగ్ చౌతాలా స్వతంత్ర ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హిసార్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాష్ చేతిలో ఓడిపోయారు. శాసన సభ్యుడు కానప్పటికీ విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగారు. కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 5న జరుగనున్నది. అక్టోబర్ 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
#WATCH | Haryana: BJP leader Ranjit Singh Chautala says, "I will contest as an independent candidate from the Rania Assembly constituency. It is the decision of the people of my constituency. I have resigned from the minister's post."
BJP has fielded Shishpal Kamboj from Rania… pic.twitter.com/XXaB3BxQ6L
— ANI (@ANI) September 5, 2024