Police Constable Shoots Wife | స్కూటీపై వెళ్తుండగా రోడ్డుపై వాగ్వాదం.. భార్యను కాల్చి చంపిన కానిస్టేబుల్
Police Constable Shoots Wife | స్కూటీపై వెళ్తుండగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్ అయిన భర్త ఆగ్రహించాడు. తన వద్ద ఉన్న పిస్టల్‌తో భార్యపై కాల్పులు జరిపాడు. ఆమె పుట్టిన రోజు నాడే హత్య చేశాడు.
న్యూఢిల్లీ: స్కూటీపై వెళ్తుండగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్ అయిన భర్త ఆగ్రహించాడు. తన వద్ద ఉన్న పిస్టల్‌తో భార్యపై కాల్పులు జరిపాడు. ఆమె పుట్టిన రోజు నాడే హత్య చేశాడు. (Police Constable Shoots Wife) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మనీష్ భాటి ఢిల్లీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్. తూర్పు ఢిల్లీలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్‌లో అతడ్ని నియమించారు. 26 ఏళ్ల భార్య ప్రియాంక టీచర్‌గా పని చేస్తున్నది.
కాగా, సోమవారం తెల్లవారుజామున కానిస్టేబుల్ మనీష్ భాటి తన భార్య ప్రియాంకతో కలిసి స్కూటీపై ప్రయాణించాడు. తూర్పు ఢిల్లీలోని కళ్యాణ్పురి ప్రాంతంలో ఈ దంపతులు స్కూటీపై వెళ్తుండగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనీష్ రోడ్డు పక్కన స్కూటీ ఆపాడు. ఆ తర్వాత వారిద్దరూ గొడవపడ్డారు. ఆగ్రహించిన మనీష్ తన వద్ద ఉన్న పిస్టల్‌తో భార్య ప్రియాంకపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత స్కూటీపై అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు రోడ్డుపై రక్తం మడుగులో పడి ఉన్న ప్రియాంకను కొందరు వ్యక్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య ప్రియాంక పుట్టిన రోజు నాడే భర్తైన పోలీస్ కానిస్టేబుల్ కాల్చి చంపాడని పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న మనీష్ భాటిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

