హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ ఉదయం భూ కంపం(Telangana Earthquake) సంభవించింది. ములుగు జిల్లాలో ఉదయం 7.27 నిమిషాలకు.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతో భూమి ఊగిపోయింది. అయితే సుమారు 55 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఆ రేంజ్లో భూమి వణికినట్లు సెసిమాలజీ నిపుణులు చెబుతున్నారు. 1969లో భద్రచాలం ప్రాంతంలో ఆ స్థాయిలో భూకంపం వచ్చినట్లు హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ సెసిమాలజీ శాఖ మాజీ చీఫ్ డాక్టర్ శ్రీ నాగేశ్ తెలిపారు.
మేడారం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే.. భద్రతాచలం ప్రాంతంలో.. ఇదే స్థాయిలో 1969లో భూకంపం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. భద్రాచలం-మేడారం సెక్షన్.. సెసిమిక్ జోన్ 3లో ఉన్నది. దీంతో గత కొన్ని దశాబ్ధాల నుంచి ఎన్జీఆర్ఐ ఆ ప్రాంతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి సెసిమిక్ యాక్టివిటీని గమనిస్తున్నది. దశాబ్ధ కాలం నుంచి ఆ ప్రాంతంలో 2 నుంచి 4 తీవ్రత మధ్య రెగ్యులర్గా భూకంపాలు వస్తున్నట్లు చెప్పారు. అయితే 1969 తర్వాత మొదటిసారి.. 5.3 తీవ్రతతో భూమి కంపించినట్లు ఆయన తెలిపారు.
EQ of M: 5.3, On: 04/12/2024 07:27:02 IST, Lat: 18.44 N, Long: 80.24 E, Depth: 40 Km, Location: Mulugu, Telangana.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/x6FAg300H5— National Center for Seismology (@NCS_Earthquake) December 4, 2024
40 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు నిపుణులు వెల్లడించారు. దీన్ని మాడరేట్ భూకంపంగా విభజించారు. రిక్టర్ స్కేలుపై 5.0 నుంచి 6.9 తీవ్రతతో భూమి కంపిస్తే దాన్ని మధ్యస్థాయి భూకంపంగా పరిగణిస్తారు.