Banke Bihari Temple | హోలీ పండుగ.. భక్తులకు అడ్వైజరీ జారీ చేసిన బాంకే బిహారి ఆలయ పరిపాలన..
Banke Bihari Temple | ఈ నెల 23న హోలీ పండుగ కోసం దేశం సిద్ధమవుతున్నది. రంగుల పండుగ కోసం ఉత్తరప్రదేశ్ బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం సైతం సిద్ధమవుతున్నది. ఆలయంలో హోలీ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు.
Banke Bihari Temple | ఈ నెల 23న హోలీ పండుగ కోసం దేశం సిద్ధమవుతున్నది. రంగుల పండుగ కోసం ఉత్తరప్రదేశ్ బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం సైతం సిద్ధమవుతున్నది. ఆలయంలో హోలీ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో బాంకే బిహారి ఆలయ నిర్వాహకులు హోలీ నేపథ్యంలో అడ్వైజరీని జారీ చేశారు. ఆలయంలో ఠాకూర్జీ (కృష్ణుడి విగ్రహం)పై గులాల్, రంగులు చల్లడం, మాలలు వేయకూడదని తెలిపారు. కల్తీ రంగులు వాడడం వల్ల సందర్శకుల ఆరోగ్యానికి హాని జరుగుతుందన్నారు.
ఆలయ మేనేజర్ మునీష్ కుమార్ జారీ చేసిన అడ్వైజరీలో.. ఆలయంలో హోలీ రోజున ఎలాంటి గందరగోళన పరిస్థితులు ఉండకూడదన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన వన్ వే రూట్ చార్జ్ ద్వారా మాత్రమే ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని.. తర్వాత ఆలయం నుంచి వెళ్లిపోవాలన్నారు. వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలు, ఆరోగ్య సమస్యలు.. అలెర్జీ ఉన్న వ్యక్తులు రద్దీ సమయాల్లో ఆలయానికి రావొద్దని… భక్తులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే ఆలయానికి రావాలని అడ్వైజరీలో తెలిపారు. ఆలయానికి వచ్చే సమయంలో విలువైన వస్తువులు తీసుకురావొద్దని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

