బెంగాల్లో పెరుగుతున్న అడెనోవైరస్ కేసులు.. అసలేంటీ వైరస్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
శాంపిల్స్‌లో 32 శాతం మందికి పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్య అధికారులు చెప్పారు. గత కొన్ని రోజులుగా వైరస్ సోకిన పిల్లలతో ఆసుపత్రులు నిండుతున్నాయని వెల్లడించారు. ఆదివారం ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు వివరించారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అడెనోవైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో పిల్లలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. కోల్‌కతాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్‌కి జనవరి నుంచి పలు శాంపిల్స్ పంపినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ శాంపిల్స్‌లో 32 శాతం మందికి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు.
గత కొన్ని రోజులుగా వైరస్ సోకిన పిల్లలతో ఆసుపత్రులు నిండుతున్నాయని వెల్లడించారు. ఆదివారం ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు వివరించారు. మరణించిన వారిలో ఒక బాబు వయసు ఆరు నెలలు కాగా, బాలిక వయసు రెండున్నర ఏళ్లు అని పేర్కొన్నారు. అయితే ఇద్దరి పిల్లల మరణానికి అడెనోవైరస్ కారణమన్నది అధికారికంగా గుర్తించలేదన్నారు.
అడెనో వైరస్ సోకితే కనిపించే లక్షణాలివే..
అడెనోవైరస్ సోకడం వల్ల తేలికపాటి జలుబు లేదా ఫ్లూ, జ్వరం, గొంతు నొప్పి, తీవ్రమైన ఉపిరితిత్తుల సమస్య, న్యుమోనియా, కండ్లకలక, కడుపులో మంట, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. తేలికపాటి నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుందని చెప్పారు. బలహీనమైన రోగనిరోధక శక్తి, శ్వాసకోశ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వ్యక్తులు అడెనోవైరస్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. అన్ని వయసుల వారిని ఈ వైరస్ ప్రభావితం చేస్తుందన్నారు. రోగులు దగ్గడం, తుమ్మడం, తాకడం వల్ల, మలమూత్రాల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు.
ఈ జాగ్రత్తలు మస్ట్..
అడినోవైరస్ సోకిన వారికి నిర్దిష్ట చికిత్సా విధానం లేదని వైద్య నిఫుణులు తెలిపారు. అలాగే ఆమోదించిన యాంటీవైరల్ మందులు కూడా లేవని చెప్పారు. నొప్పి నివారణ మాత్రల ద్వారా తేలికపాటి లక్షణాలు తగ్గుతాయని అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడమే ఉత్తమ మార్గమని వెల్లడించారు. ఎల్లప్పుడూ సబ్బుతో చేతులు కడుక్కోవాలని, పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Marburg Virus | ఒక్కరోజే 9 మందిని బలి తీసుకున్న ప్రాణాంతక వైరస్.. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీని లక్షణాలేంటి?
Giveaway Offers | బంపర్ ఆఫర్ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

