Marburg Virus | ఒక్కరోజే 9 మందిని బలి తీసుకున్న ప్రాణాంతక వైరస్.. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీని లక్షణాలేంటి?
Marburg Virus | ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ ఫ్యామిలీ నుంచి కొత్త వైరస్ వచ్చింది. ఆఫ్రికా దేశమైన ఈక్వెటోరియల్ గినియాలో మార్బర్గ్ వైరస్ను గుర్తించారు. ఈ వైరస్ బయటపడిన తొలిరోజే 9 మంది దుర్మరణం చెందడం ప్రపంచ దేశాలను వణికిస్తుంది.
Marburg Virus | ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ ఫ్యామిలీ నుంచి కొత్త వైరస్ వచ్చింది. ఆఫ్రికా దేశమైన ఈక్వెటోరియల్ గినియాలో మార్బర్గ్ వైరస్ను గుర్తించారు. ఈ వైరస్ బయటపడిన తొలిరోజే 9 మంది దుర్మరణం చెందడం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ వస్తే హెమరేజిక్ ఫీవర్ బారిన పడతారని.. తీవ్ర జ్వరంతో రక్తనాళాలు చిట్లి మరణించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్వో హెచ్చరించడంతో అంతా భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో అసలు మార్బర్గ్ వైరస్ అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీని లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా? వంటి వివరాలు ఒకసారి చూద్దాం..
మార్బర్గ్ వైరస్ ఎలా వచ్చింది?
మార్బర్గ్ వైరస్ అనేది ఫిలోవిరిడే కుటుంబానికి చెందిన వైరస్. ప్రాణాంతక ఎబోలా వైరస్ కూడా ఈ ఫ్యామిలీకి చెందినదే. ఇది జూనోటిక్ వైరస్.. అంటే జంతువుల శరీరాలను ఆవాసంగా చేసుకుని జీవిస్తాయి. ముఖ్యంగా ఆఫ్రికన్ ఫ్రూట్ గబ్బిలాల్లో ఈ వైరస్ జీవిస్తుంది. గబ్బిలాల్లో ఉండే ఈ వైరస్.. వాటికి ఎలాంటి హాని చేయవు. ఎప్పుడైతే కోతులు, మనుషుల్లోకి సంక్రమిస్తుందో అప్పుడే ఈ వైరస్ ప్రాణాంతకంగా మారుతుంది. ఈ వైరస్ సోకితే వచ్చే వ్యాధిని మార్బర్గ్ వైరస్ డిసీజ్ ( ఎంవీడీ ) లేదా మార్బర్గ్ హెమరేజిక్ ఫీవర్ అని పిలుస్తారు.
మార్బర్గ్ వైరస్ను 1967లో తొలిసారి గుర్తించారు. జర్మనీలోని ఫ్రంక్ఫర్ట్, సెర్బియాలోని బెల్గ్రేడ్లో ఈ వైరస్ను వేర్వేరుగా గుర్తించారు. ఉగాండా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్ ఆకుపచ్చ కోతులపై పరిశోధనలు చేసే క్రమంలో ఈ వైరస్ ఆనవాళ్లను మొదటిసారి గుర్తించారు. ఆ తర్వాత ఈ వైరస్కు సంబంధించిన ఎంవీడీ కేసులను అంగోలా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, కెన్యా, దక్షిణాఫ్రికా, ఉగాండాలో గమనించారు.
ఈ వైరస్ ఎలా సోకుతుంది?
ఫ్రూట్ గబ్బిలాల నుంచి మార్బర్గ్ వైరస్ ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో మనుషులకు సోకుతుంది. అంజీరా, మామిడి, ఖర్జూర వంటి పండ్లను ఫ్రూట్ గబ్బిలాలు కొరికి తిన్నప్పుడు వాటి లాలాజలం, సలైవా వాటికి అతుక్కుంటుంది. ఆ పండ్లను కోతులు లేదా ఇతర జంతువులు తిన్నప్పుడు వాటికి అతుక్కున్న సలైవా శరీరంలోకి వెళ్లడం ద్వారా మార్బర్గ్ వైరస్ సంక్రమిస్తుంది. గుహలు, గనుల్లోకి వెళ్లినప్పుడు కూడా అక్కడి ఆఫ్రికన్ ఫ్రూట్ గబ్బిలాల స్రవాల ద్వారా సోకుతుంది. అలాగే మార్బర్గ్ వైరస్ సోకిన జంతువుల సలైవా, యూరిన్, మలం, ఇతరత్రా స్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ఇక మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. తుంపిర్లు, చెమట, సలైవా, వీర్యం, యూరిన్, మలం, తల్లి పాల ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుంది. కలుషిత ఆహారం ద్మావారా కూడా ఇది సోకుతుంది. మార్బర్గ్ వైరస్ సోకిన వ్యక్తులు ఉపయోగించిన దుస్తులు, బ్లాంకెట్స్, గిన్నెలకు అతుక్కున్న స్రవాలు ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. మార్బర్గ్ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఎంవీడీ అవశేషాలకు ఇంకా కళ్లు, వృషణాల్లో అలాగే ఉంటాయి. అయితే యోని ద్రవాల ద్వారా మార్బర్గ్ వైరస్ వ్యాపిస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
లక్షణాలు ఏంటి?
మార్బర్గ్ వైరస్ సోకిన తర్వాత 2-21 రోజుల్లోనే లక్షణాలు బయటపడి తీవ్రస్థాయికి చేరుకుంటాయి. అస్వస్థతకు గురైన మూడు రోజుల్లోనే జ్వరం, చలి, తలనొప్పి, గొంతు నొప్పి, అలసట, కండరాలు నొప్పి, డయేరియా, రక్తపు వాంతులు, వికారం, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదు రోజుల తర్వాత ఛాతి, వీపు, పొట్ట భాగంలో ఎర్ర మచ్చలు, దద్దుర్లు ఏర్పడతాయి. 5 నుంచి 7 రోజుల్లో రక్తస్రావం మొదలవుతుంది. కళ్లు, చెవులు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. ఆరోగ్యం క్షీణించినకొద్దీ ఛాతి నొప్పి, బరువు తగ్గడం, గందరగోళం, మూర్చ, తీవ్ర జ్వరం, వృషణాల వాపు, అవయవాల వైఫల్యం వంటి సమస్యలు ఏర్పడతాయి. 8 నుంచి 9 రోజుల్లోనే ఇది మరణానికి దారితీస్తుంది. మార్బర్గ్ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ చాలా వారాల పాటు వాటి లక్షణాలు కొనసాగుతాయి. జుట్టు రాలడం, కాలేయ వాపు, అలసత్వం, నీరసం, తలనొప్పి, కళ్లు, వృషణాల వాపు వంటి సమస్యలు కొద్ది వారాల వరకు వేధిస్తాయి.
వ్యాప్తిని ఎలా నివారించాలి?
ఆర్టీ-పీసీఆర్, ఎలీసా ( ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసోర్బెంట్ అస్సే ) టెస్టుల ద్వారా మార్బర్గ్ వైరస్ను నిర్ధారిస్తారు. ప్రస్తుతానికి అయితే ఈ వైరస్ను నివారించేందుకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవాలంటే వ్యక్తిగత దూరం పాటించాలి. వైరస్ సోకిన వ్యక్తులను కలిసిన వారిని క్వారంటైన్లో ఉంచాలి. మాస్కులు ధరించాలి. చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ఎంవీడీ బయట నుంచి పడిన తర్వాత కూడా దాదాపు 12 నెలల పాటు వృషణాల్లో మార్బర్గ్ వైరస్ అవశేషాలు ఉంటాయి. కాబట్టి వీర్యంలో మార్బర్గ్ వైరస్ నెగెటివ్ వచ్చేదాకా శృంగారంలో పాల్గొనకపోవడం గానీ.. కండోమ్స్ వాడటం గానీ చేయాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మార్బర్గ్ వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు.
చికిత్స ఎలా?
మార్బర్గ్ వైరస్ నియంత్రణకు ప్రత్యేకించి మందులు ఏమీ లేవు. లక్షణాలను బట్టి మందులు అందిస్తారు. వీలైనంత వరకు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. వాంతులు, విరేచనాల ద్వారా నీరసించి పోతారు కాబట్టి ఎలక్ట్రోలైట్స్, పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి. ఆక్సిజన్ అవసరం కూడా ఉండొచ్చు. బ్లడ్ ప్రెజర్ పెరిగితే రక్తనాళాలు చిట్లి మరణించే అవకాశాలు ఉంటాయి. అందుకే బ్లడ్ ప్రెజర్ పెరగకుండా మందులు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో రక్తమార్పిడి చేయాల్సి కూడా ఉంటుంది.
Read More :
Giveaway Offers | బంపర్ ఆఫర్ అంటూ మెసేజ్లు వస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

