న్యూఢిల్లీ, నవంబర్ 26: గత ఏడాది జనవరిలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకొన్న భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి మరో ఆరుగురు పోలీస్ అధికారులపై ఆ రాష్ట్ర హోంశాఖ ఆదివారం వేటు వేసింది. తాజాగా సస్పెన్షన్కు గురైన వారిలో ఇద్దరు డీఎస్పీ ర్యాంకు అధికారులు పార్శన్ సింగ్, జగదీశ్ కుమార్తో పాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ ఉన్నారు. వీరితో సస్పెండ్ వేటు పడిన పోలీసు అధికారుల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే ప్రస్తుతం బఠిండా జిల్లా ఎస్పీగా ఉన్న(అప్పటి ఫిరోజ్పూర్ ఎస్పీ) గుర్బిందర్ సింగ్ను శనివారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ డీజీపీ నివేదిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకొన్నది.