న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశ తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ సినీ నటి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కంగనా.. ‘ముందు నేను ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను.
మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారతదేశ మొదటి ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్ ఎక్కడికెళ్లారు?’ అంటూ వ్యాఖ్యానించారు. కంగనా వ్యాఖ్యలను యాంకర్ సరిచేయడానికి ప్రయత్నిస్తూ.. ‘భారతదేశ మొదటి ప్రధాని బోస్ కాదు’ అని చెప్పగా.. మళ్లీ కంగనా బదులిస్తూ.. ‘ఎందుకు? ఆయన(బోస్) ఎక్కడికెళ్లారు? ఆయనను ఎవరు అదృశ్యం చేశారు?’ అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు.