Actor Vijay : తమిళనాడులో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని టీవీకే పార్టీ (TVK party) అధ్యక్షుడు, నటుడు విజయ్ (Actor Vijay) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఈ మేరకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి విజయ్ ఒక వినతి పత్రం ఇచ్చారు.
అదేవిధంగా తమిళనాడులో ఇటీవల తీవ్ర ప్రభావం చూపిన ఫెంగాల్ తుఫాను అంశాన్ని కూడా నటుడు విజయ్ తన పిటిషన్లో ప్రస్తావించారు. ఫెంగాల్ తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా ప్రభావితమైన వారికి ఇప్పటికీ సరైన రిలీఫ్ అందలేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రిలీఫ్ ఫండ్‌ను రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని నటుడు గవర్నర్‌ను కోరారు.
#WATCH | Tamil Nadu: TVK Chief and Actor Vijay leaves from Raj Bhavan in Chennai after meeting Tamil Nadu Governor RN Ravi. pic.twitter.com/OlkfjaB9CW
— ANI (@ANI) December 30, 2024