Viajaykanth | విజయకాంత్ సినీ ప్రస్థానం.. 20కి పైగా పోలీసు కథల్లో నటన
Viajaykanth | విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. 27 ఏండ్ల వయసులో తెరంగ్రేటం చేసి 2015 వరకు నిర్విరామంగా నటించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా విజయకాంత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
Viajaykanth | చెన్నై : డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్(71) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనాతో బాధపడుతున్న ఆయన మియోట్ ఆస్పత్రిలో మంగళవారం చేరారు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు.
1952, ఆగస్టు 25న జన్మించారు. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. 27 ఏండ్ల వయసులో తెరంగ్రేటం చేసి 2015 వరకు నిర్విరామంగా నటించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా విజయకాంత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సుమారు 150కి పైగా చిత్రాల్లో నటించి, మెప్పించారు. అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. దాదాపు 20కి పైగా పోలీసు కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్.. ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఇడి ముళక్కం, సత్తం ఒరు ఇరుత్తరై సినిమాలతో విజయాలు అందుకున్నారు. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్గా పిలుస్తున్నారు. ఇక విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005 డీఎండీకే పార్టీని స్థాపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

